వెండి తెరపై ఇప్పటివరకూ ఎంతో మంది లెజెండ్రీ నటీనటుల బయోపిక్ లు సందడి చేయడం చూశాం. ఇంకా పలువురి బయోపిక్ లు తెరకెక్కుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ కూడా తెరపైకి వచ్చింది. ఆ బయోపిక్ ఎవరిదో కాదు. తెలుగు సినీ చరిత్రలో సోగ్గాడుగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబుది. . ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఒకరు ఆయన బయోపిక్ ను చేయాలని భావిస్తున్నాడట. అంతేకాదు ఎప్పటినుండో ఈ కథపై పని చేస్తున్నాడట. ఇంకా శోభన్ బాబు కుటుంబసభ్యుల నుండి అనుమతులు కూడా తీసుకున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ బయోపిక్ కోసం రానాను సంప్రదించినట్టు తెలుస్తుంది. శోభన్ బాబు పాత్రకు రానా అయితే అన్ని విధాలుగా సెట్ అవుతాడు అంటూ బయోపిక్ ను ప్లాన్ చేస్తున్న వారు బలంగా నమ్ముతున్నారట. ఇక కథను రానాకు చెప్పగా రానాకు కూడా కథ నచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి.. వచ్చే ఏడాది నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రానా ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో చంద్రబాబు నాయుడు పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు.
కాగా 1959లో దైవ బలం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శోభన్ బాబు దాదాపు మూడు దశాబ్దాలపాటు తన నటనతో అలరించారు. తన సినీ ప్రయాణంలో దాదాపు 200కు పైగా సినిమాలు చేశారు. మార్చి 20, 2008 న శోభన్ బాబు తుది శ్వాస విడిచారు.
ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: