బిగ్ బాస్4- బిగ్ బాస్ 6వ వారంలో అప్పుడే రెండో రోజులు పూర్తయింది. ఇక ముందు మార్నింగ్ మస్తీలో భాగంగా సోహైల్ కిచెన్‌గా మారిపోయాడు. దీంతో అమ్మ రాజశేఖర్ వంట వండుతూ… అతడిని చపాతీలా రుబ్బుతూ.. ఆడుకున్నారు. అవినాష్ బెడ్‌లా మారిపోగా అమ్మ రాజశేఖర్ అతడిపై విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నాడు. అఖిల్ వాష్‌రూమ్‌గా మారిపోగా అవినాష్, అమ్మ రాజశేఖర్ కామెడీ చేసి నవ్వు తెప్పించారు. మోనాల్ తలుపుగా మారిపోగా అందరూ మరోసారి రోబో టాస్కును గుర్తు చేస్తూ డోర్ విరగ్గొట్టేలా విరుచుకుపడ్డారు. దివి కాసేపు డస్ట్‌బిన్‌లా చేసింది. మరోవైపు అభిజిత్ సోహైల్‌కు అందరూ ఇచ్చే సలహానే మళ్లీ గుర్తు చేశాడు. నువ్వు కోపం తగ్గించుకుంటే ఇంత మంచోడివా అనిపిస్తది, కాబట్టి కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకో అని సలహా ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా ముగిసిందని హౌస్ మేట్స్ కూల్ అయ్యేలోపు వెంటనే కెప్టెన్సీ టాస్క్ పెట్టి హౌస్ మేట్స్ ను బిజీ చేసేసాడు బిగ్ బాస్. బిగ్‌బాస్ ఇంటిసభ్యులను బ్లూ, రెడ్ టీమ్స్‌గా విడగొట్టారు. రెడ్ టీమ్ కు అరియనా.. బ్లూ టీంకు అఖిల్ లీడ్ చేయగా సోహైల్ సంచాలకుడిగా వ్యవహరిస్తాడు. ఇక ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ రెండు టీమ్స్‌కు సమంగా బంగారు నాణాలు ఇస్తారు. టాస్క్ ముగిసే సమయానికి బిగ్‌బాస్‌తో ఎక్కువ డీల్స్ కుదుర్చుకుని ఏ టీమ్ ఎక్కువ నాణాలు ఖర్చుపెడుతుందో వారే గెలుపును సాధించినట్లు లెక్క. గెలిచిన టీమ్ సభ్యులే కెప్టెన్సీకి పోటీ పడతారు. కెప్టెన్సీ కాబట్టి హౌస్ మేట్స్ పోటీ పడి మరి గేమ్ ఆడారు. మొదట అఖిల్ గంట కొట్టడంతో కుమార్ సాయి తను వేసుకున్న డ్రెస్సును కత్తిరించుకోవాలనే టాస్క్ ఇచ్చాడు. ఆ తర్వాత అరియనా బెల్ కొట్టడంతో అభి తన దగ్గర ఉన్న వస్తువులు మొత్తం ఇచ్చేసారు. ఇక మూడో సారి అఖిల్ బెల్ కొట్టగా.. అందులో భాగంగా హారిక తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా సరే, ఏడుస్తూనే జుట్టు కత్తిరించుకునేందుకు సిద్ధపడి జుట్టు కత్తిరించుకుంది. ఆ తర్వాత మళ్లీ అఖిల్ కొట్టడంతో కుమార్ ఓ తాడుకు కట్టి ఉన్న బస్తాను కింద ఆనించకుండా పట్టుకున్నాడు. నెక్స్ట్ అరియనా బెల్ కొట్టడంతో.. స‌్టోర్ రూమ్ ద్వారా పంపించే వస్తువులతో డ్రింక్ తయారు చేసి రెండు గ్లాసులు తాగాల్సి ఉంటుంది. లాస్య ఛాలెంజ్ స్వీకరించింది. ముక్కు మూసుకుని రెండు గ్లాసులను గటగటా తాగేసింది. ఆ తర్వాత అరియానా బెల్ కొట్టడంతో.. ఆమె టీమ్‌లోని మోనాల్ జనపనారతో అల్లిన దుస్తులు ధరించింది.
మరి ఈ రోజు మరికొంత మంది మిగిలిన సభ్యులు కొన్ని టాస్క్ లు చేస్తున్నారు. ప్రోమో చూస్తుంటే మాత్రం నోయల్ కు అవినాష్ కు మధ్య పెద్ద గొడవే జరిగినట్టు కనిపిస్తుంది . చూద్దాం మరి ఈ రోజు బిగ్ బాస్ ఏ టాస్క్ లు ఇస్తాడో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























