2020 మరో లెజెండ్రీని బలి తీసుకుంది. ఇప్పటికే ఎంతో మంది యువ నటీనటుల దగ్గరనుండి సీనియర్ నటీనటుల వరకూ ఎంతోమంది మృతి చెందారు. రీసెంట్ గానే గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం కూడా కన్నుమూశారు. ఇక ఇప్పుడు తాజాగా మరో గొప్ప డ్యాన్సర్ చనిపోయారు. కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు నేడు తుది శ్వాస విడిచారు. నెలరోజుల క్రితం ఇంటిలో జారిపడటంతో ఆమె తలకు స్వల్ప గాయమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల ఆమెకు కరోనా కూడా సోకడంతో. పది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆమెకు కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున శోభానాయుడు తుదిశ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విటర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.`శోభానాయుడు లాంటి గొప్ప కూచిపూడి కళాకారిణి ఇక లేరని తెలిసి ఎంతో బాధకు గురయ్యాను. ఆమె మృతి మనకీ, తెలుగు సాంస్కృతిక సమాజానికి తీరని లోటు. తన గురువు శ్రీ వెంపటి చిన సత్యంగారి వారసత్వాన్ని శోభానాయుడు ఘనంగా కొనసాగించారు. కూచిపూడి ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని అందరికీ పరిచయం చేశారు. ఎంతో మంది కూచిపూడి నృత్య కళాకారులను తయారు చేశారు. వారితో నాకు వ్యక్తి గతంగా ఎంతో పరిచయం ఉంద`ని చిరంజీవి పేర్కొన్నారు.
Rest in peace #ShobhaNaidu garu. pic.twitter.com/y3zgf4VrBM
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 14, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: