ఈ మధ్య ఏంటో హీరోల ఇంటికి బాంబు బెదిరింపులు వెళ్తున్నాయి. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్, ఇళయదళపతి విజయ్, అజిత్, సూర్య ఇంటిలో బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుస్, విజయ్ కాంత్ ఇండ్లలో బాంబులు పెట్టినట్టు పోలీస్ కంట్రోల్ రూంకు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకు రెండుసార్లు ఫోన్ చేసి చెన్నైలోని అభిరామపురంలో ఉన్న ధనుష్ ఇంటితోపాటు విరుగంబాక్కమ్‌లోని విజయ్ కాంత్ ఇంట్లో బాంబుల పెట్టినట్టు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన నటుల పోలీసులు నటుల ఇళ్ల వద్దకు చేరుకొని గాలింపులు జరిపారు. అక్కడ వారికి ఏమీ దొరకలేదు. దీంతో ఇది ఫేక్ కాల్‌గా గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెండు ఫోన్ కాల్స్ ఓ వ్యక్తి నుంచి వచ్చాయని గుర్తించిన పోలీసులు..ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ధనుష్ ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ తో బిజీగా ఉండగా..విజయ్ కాంత్ ఇటీవలే కోవిడ్-19 బారి నుంచి కోలుకున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: