చాలా గ్యాప్ తరువాత విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు విష్ణు మాత్రం షూట్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలిపారు.
ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో సాలిడ్ వచ్చింది. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మే20వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ టీజర్ ను ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు.
i@iVishnuManchu
Can’t wait to show you all The World Of #𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚🏹 on the 20th May. Launching it in 'Cannes Film Festival'💪🏽#TheWorldOfKannappa #CannesFilmFestival
కాగా ఈసినిమాలో నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ విష్ణు తనయుడు అవ్రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.