విక్రమ్ తంగలాన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టే?

crazy update on vikram thangalaan movie release date

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి తంగలాన్‌ గ్లింప్స్‌తోపాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్లు, టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటికీ సస్పెన్స్ వీడలేదు. నిజానికి సినిమా షూటింగ్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడు కంప్లీట్ అయ్యాయి కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ఆమధ్య విక్రమ్ పుట్టినరోజుకు ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని అన్నారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. జూన్‌ 13న ప్రపంచవ్యాప్తంగా ఈసినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావడమే లేట్ అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

కాగా ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.