గత ఏడాది జైలర్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు తలైవా రజినీకాంత్. ఇదే జోష్ తో పలు సినిమాలను లైన్ లో పెట్టాడు తలైవా. అందులో వెట్టైయాన్ సినిమా కూడా ఒకటి. టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. జై భీమ్ లాంటి సినిమా తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈసినిమా షూట్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో రజనీకాంత్ తన పోర్షన్ షూటింగ్ ను పూర్తిచేసుకున్నట్టు చిత్రయూనిట్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
L@LycaProductions
And it is a wrap for our Thalaivar! 🎬🌟 Superstar @rajinikanth completes filming his portion for Vettaiyan. 🕶️ 🤩#VETTAIYAN 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #FahadhFaasil @RanaDaggubati @ManjuWarrier4…
కాగా మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటించనున్నారు. కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.