5ఏళ్ల ‘రుద్రమదేవి’ – స్పెషల్ జర్నీ

Director Gunasekhar Visual Wonder Rudhramadevi Completes 5 Years

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా రుద్రమదేవి. తొలి భారతీయ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా రూపొందిన రుద్ర‌మదేవి గుణ‌శేఖ‌ర్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కి మంచి విజయం సాధించింది. ఇక తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రంలో అనుష్కశెట్టి, అల్లు అర్జున్, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, నిత్య మెనన్, బాబా సెహగల్, కేథరీన్ లు న‌టించిన ఈ సినిమా నేటితో 5ఏళ్ళు పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సంధర్భంగా అనుష్క తన ట్విట్టర్ ద్వారా గుర్తుచేసుకుంది అనుష్క. ఈ సినిమా జర్నీ చాలా స్పెషల్ నాకు.. అల్లు అర్జున్, రానాలు అద్భుతంగా చేశారు. చ‌రిత్ర‌ని ఇంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకొచ్చినందుకు ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. రుద్ర‌మ‌దేవి ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా అంద‌రికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను అని అనుష్క త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండగా అరుంధతి చేయాలన్నా.. దేవసేన చేయాలన్నా.. రుద్రమదేవి చేయాలన్నా.. భాగమతి చేయలన్నా ఒకే ఒక్క హీరోయిన్ వల్ల అవుతుంది. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.. వన్ అండ్ ఓన్లీ అనుష్క. అందం, అభినయం ఉండి లక్ లేకపోయినా.. లక్ ఉండి మిగిలిన రెండూ లేకపోయినా కష్టమే.. కానీ అందం, అభినయం తో పాటు లక్ కూడా వున్న హీరోయిన్ అనుష్క. అయితే తొలినాళ్లలో అనుష్క కూడా పలు ప్లాప్స్ మూటగట్టుకుందనుకోండి. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ స్టార్ హీరోయిన్ గా.. తన కోసం స్టోరీ లు రాసి సినిమా తీసే అంత స్థాయికి ఎదిగింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.