ఎస్ పి బి , బాలు అని సంగీతాభిమానులు ముద్దుగా పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా కొనేటమ్మ పేట విలేజ్ లో 1946 సంవత్సరం జూన్ 4 వ తేదీ జన్మించారు. చిన్న వయసు లోనే మ్యూజిక్ పట్ల బాలు ఆసక్తి పెంచుకున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న టైమ్ లో అనేక పాటల పోటీలలో పాల్గొని అవార్డ్స్ అందుకున్నారు. సంగీత దర్శకుడు ఎస్ పి కోదండపాణి , సింగర్ ఘంటసాల జడ్జీలు గా జరిగిన పాటల పోటీ లో బాలు బెస్ట్ సింగర్ గా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలసుబ్రహ్మణ్యం 1966 సంవత్సరం డిసెంబర్ 15 వ తేదీ “శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న ” మూవీ తో సింగర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తరువాత బాలు ,కన్నడ తమిళ , మలయాళ భాషలకు సింగర్ గా పరిచయం అయ్యి తన గానామృతం తో ప్రేక్షకుల వీనుల విందు చేశారు. 1970 ల నుండి 1980 ల వరకూ ఇళయరాజా , బాలు , ఎస్ జానకి కాంబినేషన్ లో రూపొందిన క్లాసికల్ బేస్డ్ తమిళ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. 1980 సంవత్సరంలో “శంకరాభరణం ” మూవీ లోని సాంగ్స్ అద్భుతంగా గానం చేసిన బాలు బెస్ట్ సింగర్ గా ఫస్ట్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు.
“శంకరాభరణం ” మూవీ లో సాంగ్స్ ను సంగీత దర్శకుడు కె వి మహదేవన్ కర్నాటిక్ రాగాలతో స్వరపరిచారు. క్లాసికల్ సింగర్ గా ట్రైనింగ్ పొందని బాలు ఆ సాంగ్స్ ను అలవోకగా పాడి ప్రేక్షకులను అలరించి, ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “ఏక్ దూజే కేలియే” మూవీ తో బాలు సింగర్ గా బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఏక్ దూజే కేలియే”(1981) మూవీ సాంగ్స్ ప్రేక్షకులను
ఉర్రూత లూగించాయి. బ్లాక్ బస్టర్ “మైనే ప్యార్ కియా “, “హమ్ ఆప్ కే హాయ్ కౌన్ ” మూవీస్ లో సాంగ్స్ అద్భుతంగా గానం చేసి బాలు ఆకట్టుకున్నారు.
సంగీత దర్శకులు కె వి మహదేవన్ , చక్రవర్తి, ఎమ్ ఎస్ విశ్వనాథన్ ,సాలూరి, కీరవాణి , ఏ ఆర్ రెహమాన్ , విద్యాసాగర్ , ఎస్ ఏ రాజ్ కుమార్ , సత్యం , హంసలేఖ , రాజ్ కోటి , లక్ష్మీకాంత్ ప్యారేలాల్ , రామ్ లక్షణ్ ల స్వరకల్పనలో బాలు గానం చేసిన సాంగ్స్ శ్రోతలను అలరించాయి. సింగర్స్ పి. సుశీల , ఎస్ జానకి , చిత్ర , వాణి జయరాం , ఎల్ ఆర్ ఈశ్వరి లతో బాలు పాడిన డ్యూయెట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్క రోజులో కన్నడలో 21 సాంగ్స్ , తమిళంలో 19 , హిందీ లో 16 సాంగ్స్ పాడి బాలు రికార్డ్ క్రియేట్ చేశారు.
స్టార్ హీరోలు కమల్ హాసన్ , రజనీకాంత్ , సల్మాన్ ఖాన్ వంటి పలువురు నటులకు బాలు డబ్బింగ్ వాయిస్ అందించారు. నటుడిగా 72 , సంగీత దర్శకుడిగా 46 చిత్రాలకు ఎస్ పి బాలు పనిచేశారు. ఏ హీరోకు పాడినా వారి వాయిస్ లతో ఆ సాంగ్స్ పాడడం విశేషం. ఐదున్నర దశాబ్దాలుగా 16 భాషలలో 40,000 సాంగ్స్ పాడి బాలు రికార్డ్ క్రియేట్ చేశారు. సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ , యాక్టర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ , నిర్మాతగా చిత్రపరిశ్రమకు బాలసుబ్రహ్మణ్యం ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించించింది. బెస్ట్ సింగర్ గా 6 నేషనల్ , 29 నంది , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ బాలు అందుకున్నారు.
లెజెండరీ సింగర్ బాలు కొవిడ్ -19 బారినపడి ఆగస్ట్ 5వ తేదీ చెన్నైలో MGM హెల్త్ కేర్ లో జాయిన్ అయ్యారు. సెప్టెంబర్ 7 వ తేదీ కొవిడ్ -19 నుండి రికవర్ అయ్యారు. ఇతర అనారోగ్యసమస్యలతో చికిత్స తీసుకుంటున్న బాలు సెప్టెంబర్ 25 వతేదీ 01:04 PM కు సంగీతాభిమానులను శోక సంద్రంలో విడిచి స్వర్గస్థులయ్యారు.పాట ఉన్నంత వరకూ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోట్లాది ప్రేక్షక హృదయాలలో చిరస్థాయిగా నిలిచే ఉంటారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: