బాలు రాసిన లేఖ – నా పేరు ముందు అవి వద్దు

SP Balasubrahmanyam Letter Written In His Own Hand Writing Goes Viral On Social Media

గాన గంధర్వుడు నిజంగానే గాంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎంతో మంది ప్రార్థనలు చేశారు. ఇన్ని రోజులు హాస్పిటల్ లో పోరాటం చేసిన బాలు మాత్రం ఈ రోజు తుది శ్వాస విడిచారు. నిజంగానే సినీ సంగీత ప్రపంచానికి ఈ రోజు చీకటి రోజే. తన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దుల్ని చేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇక ఆయన జ్జాపకాలను అంతా నెమరు వేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రాసిన లేఖ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో ఆయన ఓ కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ. నా పేరు ముందు ‘డాక్టర్‌’, ‘పద్మభూషణ్‌, ‘గానగంధర్వ’ వంటి విశేషణలు వేయకండి అంటూ కొన్ని చిన్న చిన్నఅభ్యర్థనలను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

క‌రోనాతో దాదాపు 50 రోజుల పాటు చెన్నైలోని ఆసుప‌త్రిలో చికిత్స పొందిన బాలు ఈ రోజు మ‌ధ్యాహ్నాం 1.04ని.ల‌కు క‌న్నుమూసారు. ఇక రేపు సాయంత్రం బాలు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. చెన్నై తిరువ‌ళ్లూరు జిల్లాలో రెడ్ హిల్స్ స‌మీపంలో ఉన్న తామ‌రైపాకంలో బాలు అంత్య‌క్రియ‌లు జ‌రగ‌నున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =