గాన గంధర్వుడు ఎస్పీ బాలు కన్నుమూత
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగష్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన బాలు శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్టు ప్రకటించారు. ఇక బాలు మరణంతో సినీ ప్రముఖులతో పాటు పలువురు సంతాపం తెలియచేస్తున్నారు.
‘మేజర్’ లో ‘దబాంగ్ 3’ బ్యూటీ
ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. `దబాంగ్ 3` బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈమె ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె.
Happy to welcome the talented & ravishing @saieemmanjrekar to @MajorTheFilm An amazing role with intensity & innocence in equal measure. She joins the film Late Oct. #MajorTheFilm@SonyPicsIndia @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @sobhitaD pic.twitter.com/bcS1SifylL
— Adivi Sesh (@AdiviSesh) September 24, 2020
ప్రముఖ నటుడు వేణుగోపాల్ మృతి
ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటించిన కోసూరి వేణుగోపాల్ కరోనా కారణంగా కన్నుమూశారు. కరోనాతో గత కొద్దిరోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నా వేణుగోపాల్ కు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినా.. ఆయన అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. దీనితో ఆరోగ్యం విషమించి మృతి చెందారు.
‘బ్లాక్ రోజ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్
బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌటేలా టాలీవుడ్ లోకి ‘బ్లాక్ రోస్’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ భరద్వాజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఊర్వశి రౌటేలా లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసారు.గత నెలలో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
There are roses in this big bad world and then there is a BLACK ROSE.
Introducing #Bollywood diva @UrvashiRautela as #BlackRose – an Emotional Thriller.
Wait for more surprises coming your way..
Lemme know how you like it 🙂#SSS4 #BlackRoseFirstLook #Manisharma pic.twitter.com/nLs1cW0Kem
— Sampath Nandi (@IamSampathNandi) September 23, 2020
నితిన్ ‘రంగ్ దే’ షూటింగ్ ప్రారంభం
నితిన్ రంగ్ దే సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్నిసితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
We are happy to inform that with all the safety precautions we have resumed shooting for our movie, #RangDe! See you all this SANKRANTHI ☺️
Always #WearAMask & Stay Safe!@actor_nithiin @KeerthyOfficial @pcsreeram @ThisIsDSP @actorbrahmaji @dirvenky_atluri @SVR4446 @vamsi84 pic.twitter.com/x4Ti8cRK40
— Sithara Entertainments (@SitharaEnts) September 23, 2020
విరాట పర్వం నటికి కరోనా పాజిటివ్
‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి జరీనా వాహాబ్ కూడా నటిస్తున్న సంగతి విదితమే. అయితే ఈమెకు ఇపుడు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది. దీనితో ఆమెను చికిత్స కోసం హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టు తెలుస్తుంది.
‘మహాసముద్రం’ లో హీరోయిన్ ఫిక్స్
అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా నటిస్తుండగా.. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
మాయాబజార్ ‘సీత’ కన్నుమూత
అలనాటి హీరో నాగభూషణం సతీమణి.. మాయాబజార్ సీత కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కోద్దిరోజులుగా బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లో కన్ను మూసారు. ఇక సీతమ్మ మృతికి చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజు గా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్న సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 21న హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వరల్డ్ ఆఫ్ బస్తీ బాలరాజు పేరుతో ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.
‘నిశ్శబ్దం’ ట్రైలర్ రిలీజ్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘నిశ్శబ్దం’ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. దీనిలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
#AnushkaShetty and ActorMadhavan 🔥🔥🔥🔥🔥https://t.co/adTSz6LoNQ#NishabdhamOnPrime premieres Oct 2 in Telugu & Tamil, with dub in Malayalam. @PrimeVideoIN
— Rana Daggubati (@RanaDaggubati) September 21, 2020
‘ప్రభాస్ 21’ కు మెంటర్ గా సింగీతం శ్రీనివాసరావు
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఇక ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతి సంస్థ అధికారికంగా తెలిపింది. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు మెంటర్ గా పని చేయనున్నారని.. ఈ సినిమాకు ఆయన క్రియేటివ్ సూపర్ పవర్స్ ఒక గైడ్ లో పనిచేస్తాయని తెలిపారు.
A long awaited dream finally comes true. We are thrilled to welcome #SingeetamSrinivasaRao Garu to our epic.
His creative superpowers will surely be a guiding force for us.#Prabhas @deepikapadukone @nagashwin7 @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/Mxvbs2s7R9— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 21, 2020




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: