“మహాసముద్రం ” మూవీ లో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్

Gang Leader Fame Priyanka Arul Mohan To Play The Female Lead In Maha Samudram Movie

సూపర్ హిట్ “RX 100 ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి ఆ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ మూవీ తరువాత అజయ్ భూపతి ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “మహాసముద్రం ” ను రూపొందించనున్నారు. ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా “మహాసముద్రం ” మూవీ రూపొందనుంది . ఈ మూవీ లో
హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మహాసముద్రం ” మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా ఎంపిక అయ్యారు. “మహాసముద్రం ” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. “ఒంద్ కథే హెల్ల “కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన ప్రియాంక అరుళ్ మోహన్ , నాని హీరోగా రూపొందిన “గ్యాంగ్ లీడర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రియాంక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “శ్రీకారం ” మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు. ప్రియాంక ఇప్పుడు “మహాసముద్రం ” మూవీలో శర్వానంద్ కు జోడీ గా మరోసారి నటించనున్నారు. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న “డాక్టర్ ” మూవీ తో ప్రియాంక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.