శుభ్రత మంచిదే – మెహరీన్

Actress Mehreen Pirzada Speaks About The Importance Of Hygiene During The Pandemic Situation

సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మెహరీన్ “మహానుభావుడు “, “రాజా ది గ్రేట్ “, “F 2” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు లోనే కాకుండా తమిళ , హిందీ , పంజాబీ భాషల చిత్రాలలో నటించిన మెహరీన్ తనకు సంబంధించిన ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మారుతి దర్శకత్వంలో శర్వానంద్ , మెహరీన్ జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “మహానుభావుడు ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో శర్వానంద్ అతి శుభ్రత (OCD)లక్షణం తో ఉన్న క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే. రియల్ లైఫ్ లో తాను కూడా అదే లక్షణం తో ఉన్నానని మెహరీన్ తెలిపారు. హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ .. తాను కూడా OCD పర్సన్ అనీ , శానిటైజర్ ఎక్కువగా ఉపయోగిస్తాననీ , శానిటైజర్ లేకుండా బయటకు అడుగు పెట్టననీ , తన హ్యాండ్ బ్యాగ్ లో కనీసం 3 శానిటైజర్ బాటిల్స్ ఉంటాయనీ , కరోనా వచ్చిందని కాదు, 5 సంవత్సరాలుగా తనకు OCD ఉందనీ , ఇప్పుడు మాస్క్ అలవాటు అయ్యిందనీ, కరోనా పరిస్థితులు నార్మల్ కు వచ్చినా మాస్క్ ధరిస్తూనే ఉంటాననీ , శుభ్రత మంచిదే , అతి శుభ్రత మంచిది కాదనీ మెహరీన్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 9 =