కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతూ కార్తికేయ, లక్కీ బ్యూటీ లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం ‘చావుకబురు చల్లగా’. ఈ చిత్రం ద్వారా. ఇక ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మిస్తున్నారు. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ‘చావుకబురు చల్లగా’ నుండి బస్తీ బాలరాజు పాత్రను పరిచయం చేస్తూ చిన్న వీడియో ను విడుదల చేసారు. ఈ టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్‌లో కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరి మాడ్యూలేషన్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇక ఇదిలా ఉండగా అజిత్ సినిమాలో విలన్ పాత్రలో కార్తికేయ చేయనున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కార్తికేయకు అజిత్ ఫ్యాన్స్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో అజిత్ ఫ్యాన్స్ కు కార్తికేయ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. నామీద ఇంత లవ్ చూపించినందుకు అజిత్ ఫ్యాన్స్ కు స్పెషల్ థ్యాంక్స్.. మంచిగా హార్డ్ వర్క్ చేసి గర్వపడేలా చేస్తానని ప్రామిస్ చేస్తున్నా అని తెలిపాడు.
A@ActorKartikeya
Special thanks to all #ThalaAjith sir fans for showering so much love on my birthday.I promise to work hard and make us all proud .. Konjam porumaiya irunga. Neenga edhir parthadha vida sirapaana oru update vara pogudhu#Valimai #WaitingForThalaDharisanam Enna Naa Solradhu😎
మొత్తానికి ఇన్ని రోజులు డౌట్ ఉండగా ఇప్పుడు మాత్రం అజిత్ సినిమాలో కార్తికేయ చేస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. కాగా హెచ్ వినోత్ దర్శకత్వంలో అజిత్ 'వాలిమై' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే చాల వరకు ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరి చూద్దాం తమిళ్ లో కార్తికేయ ఎంత సక్సెస్ అందుకుంటాడో.