చాలా కాలం బ్రేక్ తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా చేస్తుంది అదా. విప్రా దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు. “?”(క్వశ్చన్ మార్క్) అనే డిఫరెంట్ టైటిల్ ను ఈ సినిమాను ఫిక్స్ చేశారు. దానికి సంబంధించిన పోస్టర్ తో విడుదల చేసి ఆదా ఇప్పుడు ఆసక్తి రేపింది. ఇక ఈ టైటిల్ చూస్తుంటే లేడీ ఓరియెంటెడ్ గా ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Announcement !Announcement !The title of my next film in telugu is ” ? ”
Produced by #GouriKrishna
Directed by #Vipra @skcforfilms
Yes that’s the title ! ” ? ” pic.twitter.com/mTtmhM0MAs— Adah Sharma (@adah_sharma) August 28, 2020
కాగా శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీ కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో.. ఈ సినిమాతో అయినా అదా కు మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి.
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ మొదటి సినిమాతోనే తన ఇన్నోసెంట్ నటనతో.. అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత క్షణం, సన్ ఆఫ్ సత్యమూర్తి, గరం, కల్కి సినిమాల్లో నటించింది. అయితే ఇప్పటివరకూ మంచి బ్రేక్ అనేది రాలేదని చెప్పొచ్చు. దానికితోడు ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలే ఈ అమ్మడిని వరించాయి. అయినా కూడా తెలుగులో కలిసి రాలేదు. దీంతో హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. పలు చిత్రాల్లో నటించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: