సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ను కూడా ఇటీవలే ఫిక్స్ చేశారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ తో పాటు తమన్నా లుక్‌ను కూడా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ఇప్పుడు ముందే చెప్పినట్టు ఈ రోజు ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కొద్దిసేపటి క్రితమే జరుపుకుంది. నాగశేఖర్ క్లాప్ కొట్టగా, సత్య హెగ్డే కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా నాగశేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి వారి ప్రేమకథను గుర్తుకు తెస్తుందని.. ఓ యువకుడి ప్రేమజ్ఞాపకాలకు చక్కటి దృశ్యరూపంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్, భావన రవి నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ చివరి వారం నుండి స్టార్ట్ చేయనున్నారు.
కృష్ణ, మిలన నాగరాజ్ కాంబినేషన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిన ‘లవ్ మాక్ టైల్’ ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. నేటి ఉద్యోగుల ప్రేమ, రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయో ఈ సినిమా ద్వారా చూపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: