త్వరలో “రాజు గారి గది 4 ” మూవీ ?

Raju Gari Gadhi 4 To Hit The Floors Soon

వారాహి చలన చిత్రం , ఏ కె ఎంటర్ టైన్ మెంట్ , ఓక్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా రూపొందిన హారర్ కామెడీ థ్రిల్లర్ “రాజు గారి గది ” మూవీ 2015 సంవత్సరం అక్టోబర్ 16 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ సీక్వెల్ “రాజు గారి గది 2” మూవీ పివిపి సినిమా , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ , ఓక్
ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున , సమంత , సీరత్ కపూర్ లతో తెరకెక్కి 2017 సంవత్సరం అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా రూపొందిన “రాజు గారి గది 3” మూవీ 2019 సంవత్సరం అక్టోబర్ 18 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఇప్పుడు దర్శకుడు ఓంకార్ “రాజు గారి గది 4 ” మూవీ ని తెరకెక్కించదానికి ప్లాన్ చేశారని , ఓకే ఎంటర్ టైన్ మెంట్స్ , డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తోకలసి ఓంకార్ “రాజు గారి గది 4 ” మూవీ తెరకెక్కించనున్నట్టు , ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ డైరెక్ట్ గా OTT ద్వారా రిలీజ్ కానున్నట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.