విలన్ పాత్రలో కమెడియన్ సునీల్ ?

Tollywood Actor Sunil Once Again To Do Comedy Roles

బ్లాక్ బస్టర్ “నువ్వే కావాలి ” మూవీ తో కమెడియన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన సునీల్ , పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. “నువ్వు నేను ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సునీల్ బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డు అందుకున్నారు. 2006 సంవత్సరం సూపర్ హిట్ “అందాలరాముడు ” మూవీ తో సునీల్ హీరోగా మారారు.ఆ మూవీ లో తన డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కమెడియన్ గా నటిస్తూనే సునీల్ హీరోగా నటించిన “మర్యాద రామన్న “, “పూలరంగడు “, “భీమవరం బుల్లోడు ” మూవీస్ విజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా నటించిన కొన్ని మూవీస్ ప్రేక్షకాదరణ పొందలేదు. సునీల్ తిరిగి “బ్లాక్ బస్టర్ “అరవింద సమేత వీర రాఘవ ” మూవీ లో కమెడియన్ గా నటించారు. సునీల్ నటించిన “చిత్ర లహరి “, “అల.. వైకుంఠపురములో.. ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. సునీల్ ఇప్పుడు విలన్ పాత్రలో నటించారని సమాచారం. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందీప్ రాజ్ దర్శకత్వంలో సుహాస్ హీరోగా “కలర్ ఫోటో ” మూవీ రూపొందుతుంది. రీసెంట్ గా ఆ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ లో సునీల్ సీరియస్ డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. కమెడియన్ , హీరో గా ప్రేక్షకులను అలరించిన సునీల్ విలన్ గా కూడా ఆకట్టుకోనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.