‘జెర్సీ’ ట్రైన్ సీన్ ఎమోషనల్ సీక్రెట్ అదే..!

Natural Star Nani Shares An Interesting Inside Story About Jersey Train Scene

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు.. ఎవరి స్టైల్ వారిది..అందరి నటన ఒకేలా ఉండదు.. ఒకేలా నటించలేరు కూడా. ఇక ఇప్పుడున్న హీరోల్లో కామెడీ అయినా.. ఎమోషనల్ అయినా మనసుకు హత్తుకుపోయేలా తన సహజ నటనతో మెప్పించే హీరో ఎవరైనా వున్నారంటే అది నాని అని చెప్పొచ్చు. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు న్యాచురల్ స్టార్ అనే అవార్డు ఇచ్చారంటేనే అర్థంచేసుకోవచ్చు తన నటన గురించి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత ఏడాది జెర్సీ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు నాని. జెర్సీ సినిమాలో అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. కనీసం కొడుకు పుట్టిన రోజున అడిగిన బహుమతి కూడా కొనివ్వలేని తండ్రి పాత్రలో నాని నటన అద్భుతం. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు.

అయితే ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సీన్ మాత్రం మనకు బాగా గుర్తుండిపోతుంది. అదే ట్రైన్ సీన్. నాని ఇండియన్ క్రికెట్ టీం కోసం సెలెక్ట్ అయినప్పుడు బాధ, సంతోషం రెండూ కలిసి వచ్చే ఎమోషన్. ఆ సీన్ చూస్తే ఎవరైనా కంటతడి పెట్టక మానరు. మరి అలాంటి సీన్ కోసం నాని ఎంత కష్టపడి ఉంటాడో అనుకుంటాం. కానీ అదేం లేదంటున్నాడు న్యాచురల్ స్టార్. ఈ సీన్ కోసం తాను ఎలాంటి రిహార్సల్ చేయలేదంటా.. డైరెక్టర్ చెప్పిన సూచనలు పాటించి అలా చేసుకుంటూ వెళ్ళాడంట. అందుకే అంత బాగా వచ్చి.. ఆడియన్స్ కు కనెక్ట్ అయింది అంటున్నాడు. మరి ఎంతైనా న్యాచురల్ స్టార్ కాబట్టి పెద్దగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు…

ఇప్పుడు ఈ సినిమా భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ‘జెర్సీ’ చిత్రం ఎంపికైంది. ఆగస్టు 9 నుంచి, 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ‘జెర్సీ’ సినిమా ప్రదర్శన చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + ten =