శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి కూడా విదితమే. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో కీర్తి సురేష్ కు తల్లిగా నయనతార నటిస్తుందన్న వార్త జోరుగా వినిపిస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ ఒక రకంగా ఈ వార్త నయన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. మరి లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న నయన తార అప్పుడే తల్లి పాత్రకు ఒప్పుకోవడం కష్టమే. చూద్దాం ఇందులో ఎంత నిజముందో.
ఇక ఈ సినిమాను ప్రారంభించిన రోజే 2021 సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు కానీ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇప్పట్లో షూటింగ్ నిర్వహించలేకపోవడం తో ఈ సినిమా రిలీజ్ సంక్రాంతి నుండి సమ్మర్ కి వెళ్ళిపోయింది. మరి అజిత్ కు వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శివ రజనీకాంత్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తాడో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: