ప్రముఖ గాయని ఎస్.జానకి ఆరోగ్యం బాగా లేదంటూ.. ఆమె ఇక లేరంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు తెగ ప్రచారమైన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదంటూ కుటుంబ సభ్యులు ఆమె ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. జానకి గారు ఇటీవల కొంత అస్వస్థతకు గురయ్యారు..ఆమె ఓ చిన్నపాటి అనార్యోగం నిమిత్తం ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్ ట్రీట్‌మెంట్ తీసుకున్నారని.. ప్రస్తుతం చాలా బాగున్నారని క్లారిటీ ఇచ్చారు.
ఈ వార్తలపై ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు ఉదయం 20కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. జానకి అమ్మ ఇక లేరు అంటూ సోషల్ మీడియాలో కొందరు వార్తలు పోస్ట్ చేయడమే. జానకమ్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.. నేను జానకమ్మతో మాట్లాడాను. ఆవిడ చాలా బావున్నారు. సోషల్ మీడియాను పాజిటివిటీ కోసం వాడండి. ఫన్ కోసం, చెడు విషయాలను, నెగిటివిటీని ప్రచారం చేయడం కోసమో సోషల్ మీడియాను ఉపయోగించవద్దు’’ అని అన్నారు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. జన ఆర్టిస్టుల హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇలాంటి వార్తలు వింటే వారికి నిజంగానే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది.. దుష్ప్రచారంతో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
#SPBalasubrahmanyam garu trashes rumours about legendary singer #Janaki!#SPB #SJanaki #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/xE1BNthagg
— Telugu FilmNagar (@telugufilmnagar) June 29, 2020




ఇక గాయనిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జానకి గారు తన సుధీర్ఘ కెరీర్‌లో 45 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటు 17 భాషల్లో తన గానాన్ని వినిపించారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.
Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.