నరేష్ బర్త్ డే కి ‘నాంది’ నుండి ఎఫ్ఐఆర్ విడుదల..!

Naandhi FIR Movie To Release On Allari Naresh Birthday

అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇప్పుడు మరోసారి హీరోగా ‘నాంది’ అనే సినిమాతో మరో డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. జూన్ 30, అల్ల‌రి న‌రేష్ పుట్టినరోజు. ఇక ఈ సంద‌ర్భంగా ‘నాంది’ ఎఫ్ఐఆర్(ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరిట ఒక చిన్న గ్లింప్స్‌ను విడుద‌ల చేయనున్నట్టు ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ నగ్నంగా ఉంటాడు. మరి పోస్టరే ఇలా ఉంటే ఎఫ్ఐఆర్ ఎలా ఉంటుందో..


ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 14 =