కథానాయికలు

Actress Across Different Languages Are Now Showing Interest To Play Women Oriented Roles

కమర్షియల్ మూవీస్ లో హీరోలతో ఆడిపాడిన కథానాయికలు ఇప్పుడు ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్స్ తోపాటు యువ కథానాయికలు కూడా అటువంటి మూవీస్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ తో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన విజయశాంతి అత్యధిక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి లేడీ అమితాబ్ గా పేరుపొందారు. ఆ తరువాత 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న అనుష్క “అరుంధతి”, “రుద్రమదేవి “, భాగమతి ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార రెగ్యులర్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ “అనామిక “(తెలుగు ,తమిళ), “మాయ “, “ఐరా “, “డోర “, “అరమ్ “, “కోలమావు కోకిల “, “ఇమైక్క నోడిగళ్”, “కొలైత్తూర్ కాలం ” తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ మూవీ “ఓ బేబీ ” తరువాత స్టార్ హీరోయిన్ సమంత కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. బ్లాక్ బస్టర్
“మహానటి “మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ నటించిన “పెంగ్విన్ “రిలీజ్ కాగా “మిస్ ఇండియా “, “గుడ్ లక్ సఖి ” మూవీస్ లో నటిస్తున్నారు. హీరోయిన్స్ తమన్నా , కాజల్ అగర్వాల్ , రెజీనా , నిత్యామీనన్ , నివేత థామస్ , అనుపమ పరమేశ్వరన్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here