బిగ్ బాస్ 4.. 50 రోజులు మాత్రమే..!

Big Boss Season 4 Team Takes A Call To Run The Show Only For 50 Days Keeping In View Of Government Guidelines

కరోనా ప్రభావం కేవలం వెండి తెరపైనే కాదు.. బుల్లి తెరపై కూడా పడింది. ఎన్నో సీరియల్స్, ప్రోగ్రామ్స్ షూటింగ్స్ లేక ఆగిపోయాయి. సినిమా షూటింగ్స్ చేయడానికి ఆలోచిస్తున్నారు కానీ. ఇప్పుడిప్పుడే చిన్నగా సీరియల్, పలు ప్రోగ్రామ్స్ షూటింగ్ లు స్టార్ట్ చేసారు. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4 కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగులో కూడా బిగ్ బాస్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే మూడు సీజన్ లు రాగా మూడు సీజన్ లు మంచి హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ కు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే సెల‌బ్రెటీల ఫైన‌ల్ లిస్టు కూడా త‌యారైనట్టు వార్తలు కూడా వచ్చాయి‌. అయితే ఇప్పుడు పరిస్థితులు అంతలా బాలేవు కాబట్టి కొన్ని మార్పులు చేయనున్నారట. ఇది వ‌ర‌కు ఈ గేమ్ షోలో 16 నుంచి 18 కంటెస్టెంట్లు ఉండేవారు. ఇప్పుడు 12 మందితోనే ఈ షో.. న‌డిపిస్తారట. అంతేకాదు మాములుగా అయితే దాదాపు మూడు నెలల పాటు ఈ షో నడుస్తుంది. అంటే 100 రోజులపాటు… అయితే ఈసారి మాత్రం 50 రోజులు మాత్రం షో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక బిగ్ బాస్ అంటే తెలిసిందే.. టాస్క్ లు కూడా అందరూ కలిసి చేయాల్సి ఉంటుంది. ఇక అది కూడా ఆలోచించి దానికి తగ్గట్టే అన్ని టటాస్క్ లు డిజైన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారికంగా ప్రకటించేంత వరకూ మాత్రం ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − sixteen =