రైతులకు అమల సాయం..!

Amala Akkineni Distributes Free Seeds To The Farmers Of A Remote Village In Hyderabad

కరోనా వల్ల గత రెండు నెలలుగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూనే ఉన్నాయి. ఇక సినీ ప్ర‌ముఖులు కూడా త‌మ వంతు సాయం అందించారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుండి సినీ తారలు కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. సామాన్య ప్రజల కూడా ఎంతో మంది ముందుకు వచ్చి పేదలకు సాయం చేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే పేదలను ఆదుకునేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఒక రైతుకు మాత్రం అంతంత మాత్రం సాయమే అందుతుంది. అందుకే బ్లూక్రాస్ సోసైటీ హైద‌రాబాద్ కో ఫౌండ‌ర్ అమ‌ల అక్కినేని రైతుల‌కు అండ‌గా నిల‌బ‌డి త‌న స‌హృద‌యాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కేశం పేట మండ‌టం పాపిరెడ్డిగూడ‌లో స‌ర్పంచి విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో 650 మంది రైతుల‌కు అమ‌ల అక్కినేని ఉచితంగా కంది విత్త‌నాల‌ను అంద‌జేశారు. ఒక్కొక్క రైతుకు నాలుగు కిలోల కంది విత్త‌నాల‌ను పంపిణీ చేశారు. అంతేకాదు సేంద్రీయ ప‌ద్ధ‌తుల్లో వ్య‌వసాయం చేయ‌డానికి రైతులు ముందుకు వ‌స్తే నిపుణుల‌ను పిలిపించి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో రైతుల‌కు సూచిస్తామ‌ని అమ‌ల తెలిపారు. ఈ సంద‌ర్భంగా క‌రోనా వైర‌స్ సోక‌కుండా తగు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కూడా ఆమె సూచించారు.

పెళ్లికి ముందు ఎన్నో సినిమాల్లో నటించిన అమల, పెళ్లి తర్వాత నటనకు దూరమైంది. 1992లో ‘కార్పూరా ముల్లై’ అమల నటించిన చివరి సినిమా. ఆ తర్వాత నాగార్జున్‌తో ప్రేమ వివాహం జరిగింది. అప్పటి నుంచి సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత 2012లో రిలీజ్‌ అయిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాతో తెలుగులో మరలా రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు శర్వానంద్‌ హీరోగా తెలుగు, తమిళంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్‌కు తల్లిగా అమల నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =