మలయాళం ప్రేమమ్ ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయమై, సౌత్ ఇండియన్ యువకులకు మలర్ గా మారిపోయింది సాయి పల్లవి. ఫిదా సినిమా చూశాక యువత మొత్తం ఆమె అభినయానికి, అందానికి, డ్యాన్స్ కు ఫిదా అయిపోయారు. కేవలం పాత్ర ప్రధానమైన సినిమాలే చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సాయిపల్లవి.. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫొటోను పోస్ట్ చేయగా అది అందరిని ఆకట్టుకుంటుంది. లాక్ డౌన్ నుంచి సడలింపులు లభించడంతో సాయిపల్లవి తన తల్లితో కలిసి కారులో ఎక్కడికో వెళ్తుంది. ఈ నేపథ్యంలో వెనుక సీటులో కూర్చున్న తల్లికి అద్దంలో ముద్దు పెడుతూ సాయిపల్లవి ఫొటో దిగింది. ఇరాక్ ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి. `అవకాశం దొరికినప్పుడల్లా నా ప్రేమతో మా అమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తాను` అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ ఫొటో అందరినీ ఆకట్టుకుంటుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. దీనితోపాటు వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ దగ్గర కూడా ఆమె శిక్షణ తీసుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: