సినీపెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో, ప్రభుత్వంతో జరిపిన సమావేశాలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపేలా వున్నాయి. నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని.. ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో సినీ పెద్దల మీటింగ్ పై బాలకృష్ణ స్పందించి.. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట.. ఆ సంగతి నాకు తెలియదు… వార్తలు, పేపర్ల ద్వారా తెలుసుకున్నాను. మరి ఏం చర్చలు జరుగుతున్నాయో నాకు తెలియదు.. జూన్ మూడో వారం నుండి షూటింగ్ లు మొదలు పెడతామంటున్నారు… తక్కువసిబ్బందితో.. సోషల్ డిస్టెన్సీ పాటిస్తూనే చేసుకుంటాం అని అన్నారు. ఆ తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పటల్‌లో జరిగిన మరో కార్యక్రమం వద్ద మాటల సందర్భంలో చర్చలకు ఎవరూ పిలవలేదని.. వాళ్లు అందరూ కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా శ్రీనివాస యాదవ్‌తో కూర్చుని?? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి భయపడతాం? ఇది వాస్తవం’’ అని బాలకృష్ణ అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందించి బాలకృష్ణ గారు క్షమాపణలు చెప్పాలని కోరారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై యూట్యూబ్‌లో తన సొంత ఛానలైన ‘నా ఇష్టం’ ఛానల్‌లో ఆయన స్పందించారు. నాగబాబు మాట్లాడుతూ… బాలకృష్ణగారిని పిలవకపోవడం రైటని నేను అనను.. సమాచార లోపమో? మరో కారణమో? తెలుసుకుని ఆయన అడిగినా… తప్పేం లేదు. కానీ, భూములు పంచుకుంటున్నారని ఉక్రోషంగా ఆయన మాట్లాడిన మాట… తెలుగు పరిశ్రమలో నిర్మాతగా, ఆర్టిస్టుగా ఉన్న నాకు బాధ కలిగించింది. తక్షణమే ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలి.. ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు తప్ప… భూములు పంచుకోవడానికి ఎవరూ వెళ్లలేదు. నాతో సహా చాలామందిని పిలవలేదు. భూములు పంచుకుంటున్నారని అనడం ఏంటి? ఇండస్ట్రీపై మీకున్న గౌరవం ఇదేనా? తప్పుగా మాట్లాడారు. మీరు చిత్రపరిశ్రమను మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించారు. ఇండస్ట్రీకీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికీ క్షమాపణలు చెప్పండి. అది మీ బాధ్యత’’ అన్నారు. మరి చూద్దాం ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: