సినీ కార్మికులకు అండగా ప్రభుత్వం

Minister Talasani Srinivas Yadav Distributes Ration Kits To Daily Wage Film Workers On Behalf Of Telangana Government

లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు, సినిమా రిలీజ్ లు ఆగిపోవడంతో ఎంతోమంది సినీ కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక వారికి సాయంగా ఎంతోమంది సెలబ్రిటీస్ ముందుకు వచ్చి పెద్దఎత్తున విరాళాలు కూడా అందించారు. వాళ్లకు నిత్యావసరాలను కూడా అందిచారు. కేవలం టాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే కాదు… కోలీవుడ్ నుండి.. బాలీవుడ్ నుండి కూడా పలువురు మన సినీ కార్మికులకు సాయం అందించారు. మరో వైపు చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా అనేక సేవా కార్యకమాలు చేపడుతూనే వున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సినీ కార్మికులకు అండగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఇటీవల ప్రభుత్వంతో సినీ పెద్దలు కలిసి సమస్యలు వివరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నేడు సినీకార్మికులకు అందించనున్న కిట్ల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మారేడ్ పల్లి లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హల్ నుండి నిత్యావసర వస్తువులు ఉన్న వాహనాలను ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు. ఈ నిత్యావసర సరుకులు కలిగిన కిట్స్ ను నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ సినీ కార్మికులకు అందచేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here