ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా తెలిసిందే. ఐపీఎల్ ఆగిపోయిందే అనుకుంటున్న వారిని తన వీడియోలతో అలరిస్తున్నాడు. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియో షేర్ చేస్తూ షాకిస్తున్నాడు. అలవైకుంఠపురం మూవీలోని ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ పాటలకు ఫ్యామిలీతో చిందేసి అల్లు అర్జున్‌తో పాటు అతని అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దానితో ఆగకుండా.. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే ‘నా మాట నేనే వినను’ అనే డైలాగ్ చెప్పిన వార్నర్.. ఆ మూవీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రశంసలతో పాటు సినిమా ఆఫర్‌ను అందుకున్నాడు. అనంతరం బాహుబలి సినిమాలో ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ డైలాగ్ చెప్పి డార్లింగ్ ఫ్యాన్స్‌ను అలరించాడు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా అతని అభిమానుల కోరిక మేరకు ముందు విషెస్ చెప్పిన వార్నర్.. ఆ తర్వాత ఎన్టీఆర్ పక్కాలోకల్ సాంగ్‌కు చిందేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మహేష్ అభిమానుల కోరిక మేరకు ‘సరిలేరు నీకెవ్వరూ’లోని మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్ పాటకు చేసిన టిక్‌టాక్ వీడియోను చేసిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేస్తున్నట్టు ఫోజిచ్చిన వార్నర్ తర్వాత మాయమైయ్యాడు. ‘ఇది నా షాడో బ్యాటింగ్, ఇంట్లో భార్య ,పిల్లలు ఉండటం మీరు విన్నారు కదా, మళ్ళీ కలుద్దాం’అని ఆ వీడియోకి క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఇక ఈ వీడియోపై హీరోయిన్ రష్మిక మందన్న కూడా స్పందించింది. వార్నర్ పర్ఫార్మెన్స్పై ప్రశంసలు కురిపించింది. ‘‘డేవిడ్ వార్నర్ చంపేశారు పో.. మీ క్యాప్షన్ చదివాక నవ్వు ఆగడం లేదు’’ అంటూ ఆయన వీడియోకు కామెంట్ పెట్టారు.
Shadow batting and then you hear the wife and kids are home 😂😂 bye bye #magicbat #laters #trending @urstrulyMahesh pic.twitter.com/fKQ6GYPJ4T
— David Warner (@davidwarner31) May 25, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: