సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన మొదటి సినిమా ‘రాముడు భీముడు’కి 56 ఏళ్ళు

Suresh Productions Debutant Movie Ramudu Bheemudu Completes 56 Years.

సురేష్ ప్రొడక్షన్స్.. దేశం గర్వించదగ్గ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. పరాజయాల్లోనూ అవకాశాలుంటాయని నమ్మిన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. అందుకే విజయాలు ఈ సంస్థ వెంటే నడిచాయి. అంతేకాదు.. దాదాపు అన్ని ప్ర‌ముఖ భార‌తీయ భాషల్లోనూ సినిమాలు నిర్మించిన ఘనత ఈ సంస్థది. అలాంటి సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ మొఘ‌ల్, స్టార్‌ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు నిర్మించిన మొట్ట మొదటి చిత్రం ‘రాముడు భీముడు’. మొద‌టి ప్ర‌య‌త్నంతోనే అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు డి.రామానాయుడు. ఈ చిత్రం కోస‌మే నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు తన కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రాభినయం చేయ‌డం విశేషం. జమున, ఎల్.విజయలక్ష్మి కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో ఎస్.వి.రంగారావు, రాజనాల, రేలంగి, రమణారెడ్డి, శాంతకుమారి, ఋష్యేంద్రమణి, సూర్యకాంతం, గిరిజ ముఖ్య భూమికలు పోషించగా.. హేమలత, మిక్కిలినేని అతిథి పాత్రల్లో మెరిశారు. దిగ్గజ రచయిత డి.వి.నరసరాజు కథను అందించగా తాపీ చాణక్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకి పెండ్యాల నాగేశ్వరరావు వీనులవిందైన బాణీలు అందించగా శ్రీ శ్రీ, డా.సి.నారాయణరెడ్డి, కొసరాజు, ఆరుద్ర సాహిత్యం సమకూర్చారు. “తెలిసిందిలే”, “అదే అదే అదే వింతనేను”, “ఉందిలే మంచి కాలం”, “దేశమ్ము మారిందోయ్”, “సరదా సరదా సిగరెట్టు”, “తళుకు తళుకు”, “తగునా ఇది మామ”.. ఇలా ఇందులోని ప్రతీ పాట అజరామరంగా నిలిచింది. ఈ చిత్రాన్ని తమిళంలో ‘ఎంగ వీటు పిళ్ళై’(1965), హిందీలో ‘రామ్ ఔర్ శ్యామ్’(1967), మలయాళంలో ‘అజయనుమ్ విజయనుమ్’(1976), కన్నడలో ‘మోజుగర సొగసుగర(1995) పేర్లతో రీమేక్ చేయడం విశేషం. 1964 మే 21న విడుదలై అఖండ విజయం సాధించిన ‘రాముడు భీముడు’.. నేటితో 56 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =