శేఖర్ కమ్ముల ‘గోదావరి’కి 14 ఏళ్ళు

Director Sekhar Kammula Feel Good Entertainer Godavari Completes 14 Years.

ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ద‌ర్శ‌కుల్లో శేఖర్ కమ్ముల ఒక‌రు. ‘ఆనంద్’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన సినిమా ‘గోదావరి’. సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా నటించిన ఈ చిత్రంలో నీతూ చంద్ర, తనికెళ్ళ భరణి, సి.వి.యల్.నరసింహారావు, మధుమణి, లలిత సింధూరి, కమల్ కామరాజు, శివ ముఖ్య పాత్రలు పోషించారు.

దిగ్గ‌జ ర‌చ‌యిత వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు కె.యమ్.రాధాకృష్ణన్ వీనులవిందైన స్వ‌రాలు స‌మ‌కూర్చారు. “అందంగాలేనా”, “ఉప్పొంగెలే గోదావరి”, “మనసావాచా”, “రామ చక్కని సీతకి”, “టిప్పులోయ్”, “మనసా గెలుపు”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ఆహ్లాద‌కరంగా ఉంటుంది. ‘తొలిప్రేమ'(1998) ఫేమ్ జి.వి.జి.రాజు నిర్మించిన ఈ సినిమా.. ‘ఉత్తమ ద్వితీయ చిత్రం’, ‘ఉత్తమ దర్శకుడు’(శేఖర్ కమ్ముల), ‘ఉత్తమ సంగీత దర్శకుడు’(కె.య‌మ్‌.రాధాకృష్ణన్), ‘ఉత్తమ ఛాయాగ్రాహకుడు’(విజయ్ సి.కుమార్), ‘ఉత్తమ గాయని’(సునీత – “అందంగాలేనా”) విభాగాల్లో ‘నంది’ పురస్కారాలను కైవసం చేసుకుంది. 2006 మే 19న విడుదలై జ‌నాల‌ నీరాజనాలు అందుకున్న ‘గోదావరి’.. నేటితో 14 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here