విజయ్-పూరీ సినిమా టైటిల్ ‘ఫైటర్’ కాదట..!

Fighter Is Just A Tentative Movie Title Says Charmme Kaur

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. మొదటినుండి ఈ సినిమా టైటిల్ ‘ఫైటర్’ అనే ఫిక్స్ అయిపోయాం కదా అయితే ఈ సినిమా టైటిల్ ఫైటర్ కాదట. ఈ విషయాన్ని ఈ సినిమాకు సహనిర్మాత అయిన ఛార్మి స్వయంగా చెప్పడం జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఛార్మి. ఈ సినిమాకి ఫైటర్ అఫిషియల్ టైటిల్ కాదని, వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని వెల్లడించింది. పూరీ, విజయ్ సినిమా అంటే మినిమం టైటిల్ ఉంటుందని ఛార్మీ చెప్పుకొచ్చారు. దీనితో అందరూ షాకయ్యారు. మరి చూద్దాం ఏం టైటిల్ పెడతారో.

కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు. మరి ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో… పూరీ విజయ్ ను ఎలా చూపిస్తాడో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + nineteen =