ఎన్టీఆర్ బర్త్ డే కి విశ్వక్ స్పెషల్ గిఫ్ట్..!

HIT Movie Actor Vishwak Sen Plans A Special Birthday Gift For NTR Fans On His Birthday

మే 20న యంగ్ టైగర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఇక తమ అభిమాన హీరోల పుట్టిన రోజు వస్తే అభిమానులు ఎలా జరుపుకుంటారో పెద్దగా చెప్పనవసరం లేదు.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని హీరోలు చెపుతున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు కూడా జరపొద్దని ఒక లేఖను విడుదల చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ నుండి అప్ డేట్ రావడం లేదని తెలిసిపోయింది. ఇక నిరాశలో ఉన్న వారికి కాస్త ఊరటనిచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్దమైయ్యాడు హీరో విశ్వక్ సేన్ . మాస్ కా బాప్ పేరుతో తాను నటించిన ‘ఫలక్ నామా దాస్’ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నాడు. మే 20న ఉదయం 11 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను విడుదల చేశాడు. విశ్వక్ సేన్ ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే. ఇటీవల ఓ షో లో పాల్గొన్న విశ్వక్ తెలుగులో నేను ఎక్కువగా అభిమానించే హీరో ఎన్టీఆర్… టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఆయన. ఏ సీన్ అయినా సింగిల్ టేక్ లో చేయడం ఆయన ప్రత్యేకత. ” అంటూ చెప్పిన సంగతి గుర్తుండేవుంటుంది.

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు యాక్టర్ విశ్వక్ సేన్. ఇక రీసెంట్ గా నాని నిర్మాతగా రూపొందించిన ‘హిట్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం పాగల్ అనే సినిమాను చేయడానికి సిద్దమయ్యాడు. లాక్ డౌన్ తీసేసిన తర్వాత షూట్ ను ప్రారంభించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =