సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’కి 14 ఏళ్ళు

Super Star Mahesh Babu Industry Hit Movie Pokiri Completes 14 Years.

“ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో ఆడే పండుగాడు”.. ఈ పంచ్ డైలాగ్ థియేటర్ల‌లో పేలి నేటికి సరిగ్గా 14 ఏళ్ళు. “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అంటూ పండుగాడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అంతేనా.. “ఎప్పుడొచ్చామన్న‌ది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా” అంటూ ‘పోకిరి’గా తన ఖాతాలో తొలి ఇండస్ట్రీ హిట్‌ని వేసుకున్నాడీ ఘట్టమనేని హ్యాండ్‌సమ్‌ హీరో. ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘పోకిరి’లో మహేష్ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వ‌డం విశేషం. ఇందులో మ‌హేష్‌కు జోడిగా ఇలియానా నటించగా ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్ధి, నాజర్, షాయాజి షిండే, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, సుధ, జ్యోతి రానా, మాస్టర్ భరత్ ముఖ్య భూమికలు పోషించారు. ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతంలో నర్తించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భాస్కరభట్ల, కందికొండ, విశ్వ గీతరచన చేయ‌గా “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించాడు. “ఇప్పటికింకా నా వయసు”, “గలగల పారుతున్న”, “డోలే డోలే”, “దేవుడా”, “చూడొద్దంటున్నా”, “జగడమే”.. ఇలా ప్రతీ పాట విశేషాదరణ పొందింది. వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. బెస్ట్ పాపులర్ మూవీ(పూరీ జగన్నాథ్, మంజుల ఘట్టమనేని), బెస్ట్ ఎడిటర్(మార్తాండ్ కె.వెంకటేష్), బెస్ట్ స్టంట్ మాస్టర్(ఫెఫ్సీ విజయన్), బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్(పి.రవిశంకర్) విభాగాల్లో ‘నంది’ అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే, పలు ప్రాంతీయ పురస్కారాలను కూడా అందుకుంది. అంతేకాదు.. తమిళం(‘పోక్కిరి’), కన్నడ(‘పోర్కి’), హిందీ(‘వాంటెడ్’) భాషల్లోనూ ఈ చిత్రం రీమేక్ కావడం విశేషం. 2006 ఏప్రిల్ 28న విడుదలై అప్ప‌ట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన ‘పోకిరి’.. నేటితో 14 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fourteen =