నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘మజ్ను’(2016)తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకులతో ఆడిపాడింది. స్వల్ప విరామం అనంతరం.. ‘అల్లుడు అదుర్స్’లో ఓ నాయికగా నటిస్తోంది అను. ఇదిలా ఉంటే.. తాజాగా అను ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Ask Me Anything with Anu Emmanuel | Pawan Kalyan | Mahesh Babu | Anu Emmanuel Rapid Fire Interview
18:50
Nani & Anu Emmanuel about their DATE | Salt & Pepper Interview | Telugu Filmnagar
05:46
Samantha is My Favorite Heroine says Nani Majnu Movie Heroine | Anu Emmanuel Candid Interview
04:01
Anu Emmanuel Cute Speech | Oxygen Movie Audio Launch | Gopichand | Raashi Khanna
01:43
ఆ వివరాల్లోకి వెళితే.. ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో నాని కథానాయకుడిగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు కథానాయికలకు స్థానముండగా.. వారిలో ఒకరిగా అను ఇమ్మాన్యుయేల్ ఎంపికైందని టాక్. త్వరలోనే అను ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మరి, ‘మజ్ను’తో మురిపించిన నాని, అను జోడీ.. ‘శ్యామ్ సింగ రాయ్’తోనూ అలరిస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: