మనవడి కోసం డైరెక్టర్ గా మారిన సూపర్ స్టార్..!

Super Star Krishna Turns Director For His Grand Son's Debut Movie
Super Star Krishna Turns Director For His Grand Son's Debut Movie

పైన టైటిల్ చూసిన వెంటనే మనవడి కోసం అంటే టక్కున మహేష్ తనయుడు గౌతమ్ అనుకొని వుంటారు కదా. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరి ఇంకే మనవడికి సూపర్ స్టార్ కృష్ణ డైరెక్టర్ గా మారారబ్బా అన్న డౌట్ రావొచ్చు. అదేంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్ళాల్సిందే.

గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా కుమారుడు అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న విష‌యం విదిత‌మే. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు శ్రీ‌రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల బ్రేక్ లో వున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఒక సన్నివేశానికే సూపర్ స్టార్ దర్శకత్వం వహించారట. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు కృష్ణ సెట్స్ కి వెళ్ళారంట. అక్కడ కృష్ణని చూసి షాకైన డైరెక్టర్..ఒక సన్నివేశాన్ని డైరెక్ట్ చేయమని అడగడంతో కృష్ణ కూడా ఒప్పుకొని చేశారట. ఇక గతంలో సూపర్ స్టార్ సింహాసనం, బాల చంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. మళ్లీ ఇప్పుడు ఇన్నేళ్లకు మనవడి కోసం మెగా ఫోన్ పట్టుకున్నారు.

కాగా అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య తదితరులు నటిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here