బన్నీ ‘ఐకాన్’ పై రూమర్లకు చెక్..!

ICON Movie Team Clears The Rumours
ICON Movie Team Clears The Rumours

మొత్తానికి రూమర్లకు చెక్ పెట్టారు బన్నీ 21 చిత్రయూనిట్. ఇన్నిరోజులు ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క పోస్టర్ తో గాసిప్ రాయుళ్ల నోర్లు మూయించారు. బ‌ర్త్‌డే విషెష్ చెబుతూ ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. పోస్ట‌ర్ పాత‌దే… మళ్ళీ పోస్ట్ చేసి ఈ సినిమా ప‌క్క‌న పెట్టలేదన్న క్లారిటీ ఇచ్చారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బన్నీ కి జంటగా నటించేది ఎవరు అలాగే మిగితా నటీనటులు వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ రోజు బన్నీ పుట్టిన రోజు కాబట్టి ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ముందుగా వార్తలు వచ్చినట్టే ‘పుష్ప’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే.. గుబురుగడ్డం, మెడకు నల్ల తాడు, డీ గ్లామర్‌ అండ్‌ రఫ్‌ లుక్‌లో అల్లు అర్జున్‌ ను ఎప్పుడూ చూడని విధంగా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. రష్మిక మందన్నహీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ప్రస్తుతం శ్రీరామ్ వేణు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో బిజీ గా వున్నాడు. మరోవైపు బన్నీ సుకుమార్ సినిమాతో బిజీగా వున్నాడు. వారి సినిమాలు పూర్తయిన తర్వాత వీరిద్దరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అంటే వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − two =