వేసవి సినిమాలంటేనే వినోదాలకు చిరునామా. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా 2020 సమ్మర్ కాస్త `జీరో రిలీజెస్`తో బోసిపోయింది. ఈ నేపథ్యంలో.. ఆ లోటుని తీర్చే దిశగా 2021 వేసవి ముస్తాబవుతోందని సమాచారం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు క్రేజీ ప్రాజెక్ట్స్ ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ని 2021 సమ్మర్‌కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేసినా.. పలు కారణాల వల్ల 2021 వేసవికి వాయిదా పడుతోందని ప్రచారం సాగుతోంది.




అలాగే `గబ్బర్ సింగ్` తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం కూడా 2021 సమ్మర్ నే టార్గెట్ చేసుకుందని అంటున్నారు. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్సేషనల్ డైరెక్టర్ పరశురామ్ కలయికలో రానున్న ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – `జిల్` రాధాకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న పిరియాడికల్ లవ్ స్టోరీ కూడా వచ్చే ఏడాది వేసవిలోనే రాబోతున్నాయని సమాచారం.
అంతేకాదు.. `అరవింద సమేత` వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్ – సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రానున్న ఫ్యామిలీ డ్రామా.. `ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న `పుష్ప` కూడా 2021 వేసవిలోనే సందడి చేసే అవకాశముందంటున్నారు.
మరి.. చివరాఖరికి ఈ ఆరు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఏయే చిత్రాలు వచ్చే ఏడాది వేసవికి విడుదలవుతాయో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: