‘రంగ‌మార్తాండ‌’లో రంగస్థ‌ల న‌టిగా రంగ‌మ్మ‌త్త‌?

Anasuya To Play A Pivotal Role In Krishna Vamsi Rangamarthanda

ఒకవైపు బుల్లితెర వ్యాఖ్యాత‌గా రాణిస్తూనే.. మ‌రోవైపు వెండితెర‌పై వెలుగులు పంచుతోంది టాలెంటెడ్ బ్యూటీ అన‌సూయ‌. `రంగ‌స్థ‌లం`లోని “రంగ‌మ్మ” పాత్ర‌తో న‌టిగా మ‌రోమెట్టు ఎదిగిన అను.. ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న `రంగ‌మార్తాండ‌`లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం రంగ‌స్థ‌ల న‌టిగా ఆమె పాత్ర ఉంటుంద‌ని తెలిసింది.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. న‌ట‌న నుంచి విశ్రాంతి తీసుకున్న ఓ స్టేజ్ ఆర్టిస్ట్ విషాద‌క‌ర జీవితమే `రంగ‌మార్తాండ‌` చిత్రం. మ‌రాఠీ బ్లాక్ బ‌స్ట‌ర్ `న‌ట సామ్రాట్`కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ ఎమోష‌నల్ డ్రామాలో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, వెట‌ర‌న్ యాక్ట్ర‌స్ ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండగా.. అన‌సూయ రంగ‌స్థ‌ల న‌టిగా క‌నిపించ‌నుంద‌ని టాక్. ఊరూరా తిరుగుతూ నాట‌కాలు ప్ర‌ద‌ర్శించే ఓ క‌ళాకారిణిగా ఆమె ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్టు చెబుతున్నారు. అంతేకాదు.. ర‌మ్య‌కృష్ణ కూతురిగా అన‌సూయ‌ పాత్ర ఉంటుంద‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే అన‌సూయ పాత్ర‌కు సంబంధించి పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

కాగా, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత‌మందిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ వెంచ‌ర్‌ను.. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here