సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగునాట పలు ప్రయోగాలకు చిరునామాగా నిలచిన లెజెండరీ యాక్టర్. అలాంటి కృష్ణ వెండితెరపై తొలిసారి వెలుగులు పంచిన చిత్రం `తేనెమనసులు`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘నమ్మినబంటు’, ‘వెలుగునీడలు’, ‘ఇద్దరుమిత్రులు’, ‘మంచిమనసులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘మూగమనసులు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సుమంగళి’… ఇలా నిర్దేశకుడిగా వరుస విజయాలను అందుకుంటున్న సమయంలో దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కొత్త నటీనటులతో ఓ సినిమా చేయడానికి సిద్ధ పడ్డారు. ఆ ప్రయత్నానికి తెరరూపమే.. ‘తేనెమనసులు’. సూపర్ స్టార్ కృష్ణ, రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య నాయకానాయికలుగా పరిచయమైన ఈ చిత్రంలో… కోనేశ్వరరావు, జి.యస్.ఆర్.మూర్తి, రాధాకుమారి ముఖ్య భూమికలు పోషించారు. కె.ఆర్.కె.మోహన్ రచించిన “వక్రించిన సరళరేఖలు” అనే నవలాధారంగా రూపొందిన ఈ సినిమాకి ముళ్ళపూడి వెంకటరమణ స్క్రీన్‌ప్లే అందించగా… అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన దిగ్గజ దర్శకులు కె.విశ్వనాథ్, దిగ్గజ రచయిత ఆత్రేయతో కలసి సంభాషణలు సమకూర్చడం విశేషం.




ఆత్రేయ, దాశరథి కృష్ణమాచార్యులు గీత రచన చేయగా… దిగ్గజ స్వరకర్త కె.వి.మహదేవన్ బాణీలు అందించారు. “దివి నుండి భువికి దిగివచ్చే”, “ఏమమ్మా నిన్నేనమ్మా”, “నీ ఎదుట నేను వారెదుట నీవు” వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. బాబు మూవీస్ పతాకంపై సి. సుందరం నిర్మించిన ఈ చిత్రాన్ని హిందీలో ‘డోలి’(1969) పేరుతో పునర్నిర్మించడం విశేషం. 1965 మార్చి 31న విడుదలై అఖండ విజయం సాధించిన ‘తేనెమనసులు’… నేటితో 55 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: