రీమేక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన తెలుగు కథానాయకుల్లో `విక్టరీ` వెంకటేష్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి పలు రీమేక్ మూవీస్‌లో నటించడమే కాకుండా… సింహభాగం ఘనవిజయాలు అందుకున్నారాయన. అలా విజయం సాధించిన వెంకీ రీమేక్ మూవీస్ లో ‘గురు’ ఒకటి. బాక్సింగ్ కోచ్‌గా వెంకటేష్ దర్శనమిచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రితికా సింగ్ బాక్సర్‌గా నటించింది. నాజర్, తనికెళ్ళ భరణి, ముంతాజ్ సర్కార్, రఘుబాబు, జాకీర్ హుస్సేన్, అనంత్ బాబు, సంచనా నటరాజన్, అనితా చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ చిత్రం ‘ఇరుదు సూట్రు’, హిందీ మూవీ ‘సాలా ఖడూస్’కు రీమేక్‌గా ‘గురు’ను తెరకెక్కించారు దర్శకురాలు సుధా కొంగర. విశేషమేమిటంటే… తమిళ, హిందీ వెర్షన్స్ కి సుధా కొంగరనే రూపకర్త. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో… “జింగిడి” అంటూ సాగే పాటలో తొలిసారి తన గాత్రాన్ని వినిపించి అలరించారు వెంకీ. వై నాట్ స్టూడియోస్ పతాకంపై యస్.శశికాంత్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ప్రేక్షకాదరణ పొందింది. 2017 మార్చి 31న విడుదలైన ‘గురు’… నేటితో మూడేళ్ళను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: