మ‌రోసారి అజిత్ ద్విపాత్రాభిన‌యం?

Thala Ajith Once Again To Play Dual Role For His Upcoming Movie Valimai

గ‌త ఏడాది ‘నేర్కొండ పార్వై’ (బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `పింక్`కి త‌మిళ్ వెర్ష‌న్) చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నారు కోలీవుడ్ స్టార్ అజిత్, ద‌ర్శ‌కుడు హెచ్.వినోద్. కాగా, ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో `వ‌లిమై` పేరుతో మ‌రో సినిమా రూపొందుతోంది. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో అజిత్‌కి జంట‌గా హ్యూమా ఖురేషి న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌మందిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభిన‌యంతో అల‌రించ‌నున్నాడ‌ని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ఇందులో అజిత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌నే వార్త ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు… దీంతో పాటు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పాత్రలోనూ అజిత్ క‌నిపించ‌నున్నాడ‌ని కోలీవుడ్ టాక్. త్వ‌ర‌లో ఆ పాత్రకు సంబంధించి మ‌రిన్ని విష‌యాలు వెల్ల‌డి కానున్నాయి.

కాగా, ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రి… `వాలి` త‌దిత‌ర విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో ద్విపాత్రాభిన‌యంతో అల‌రించిన అజిత్.. కొత్త చిత్రంతోనూ హిట్ కొడ‌తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.