శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న మ్యూజికల్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరి” మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఒక సరికొత్త ప్రేమ కథగా రూపొందుతున్న ఈ మూవీ లో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో ట్రైనింగ్ పొందిన పవన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న”లవ్ స్టోరి” మూవీ షూటింగ్ ముగింపు దశ లో ఉంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించారు. “లవ్ స్టోరి” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్ , టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.”లవ్ స్టోరి” మూవీ ఫస్ట్ సాంగ్ ను వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న “లవ్ స్టోరి” మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల ట్రైనింగ్ లో తెలంగాణ యాస లో నాగచైతన్య డైలాగ్స్ చెప్పడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: