‘నిశ్శబ్దం’ రిలీజ్ డేట్ ఖరారు

Nishabdham Movie Final Release Date,Nishabdham,Nishabdham Movie,Nishabdham Telugu Movie Release Date,Nishabdham Movie Updates,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Anushka Nishabdham Movie

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్దం’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే గత కొద్దిరోజులుగా ఈ చిత్రయూనిట్ రిలీజ్ డేట్ పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. జ‌న‌వ‌రి 31 విడుద‌ల అవుతుంద‌ని అప్ప‌ట్లో అన్న‌ప్ప‌టికి, టెక్నిక‌ల్ స‌మ‌స్యల వ‌ల‌న చిత్రం రిలీజ్ కాలేదు. దీనితో సినిమా రిలీజ్ పై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే ఇప్పుడు ఆ డౌట్లు అన్నిటికీ క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

[custom_ad]

కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.