మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే `మగధీర`, `బ్రూస్ లీ`, `ఖైదీ నంబర్ 150` చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. చరణ్ హీరోగా నటించిన `మగధీర`, `బ్రూస్ లీ` చిత్రాల్లో తన స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో చిరు మెస్మరైజ్ చేస్తే.. చిరు కథానాయకుడిగా నటించిన `ఖైదీ నంబర్ 150`లో చరణ్ ఓ పాట (అమ్మడు లెట్స్ డు కుమ్ముడు)లో మెరిశాడు. కట్ చేస్తే.. ఈ ఇద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. తన పాత్ర పరిధి 15-20 నిమిషాలు ఉంటుందని తెలిసింది. అంతేకాదు.. ఆచార్య అనే పాత్రలో చిరు కనిపిస్తే.. సిద్ధు అనే స్క్రీన్ నేమ్ తో చరణ్ దర్శనమిస్తాడట. ఈ ఇద్దరి మధ్య సాగే సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళేలా ఉంటాయని వినికిడి. ఏదేమైనా, చరణ్ ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న `చిరు 152`.. ఆగస్టులో రిలీజయ్యే అవకాశముంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: