‘RRR’ – సూపర్ స్టార్లతో వాయిస్ ఓవర్..!

Superstars Voice Over For RRR Movie

రాజమౌళి ఏం చేసినా తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. అలా తన డిఫరెంట్ థింకింగ్ లో నుండి వచ్చిన సినిమాలే ఒక మగధీర అయినా… బాహుబలి సిరీస్ అయినా.. ఇప్పుడు వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ అయినా. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ఈ సినిమా కోసం పలు ఇండస్ట్రీల్లోని సూపర్ స్టార్ లు కూడా పని చేస్తున్నారు. అదెలాగబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. వీళ్ళందరూ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వనుండగా.. హిందీ వెర్షన్‌కు అమితాబ్ బచ్చన్‌తో వాయిస్ ఓవర్ చెప్పించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలను రాజమౌళి కలిసి వారిని ఒప్పించినట్టు సమాచారం. ఇక కన్నడ వెర్షన్ విషయానికొస్తే.. సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. మరి ఇవి కేవలం వార్తలేనా… నిజమేనా? తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[custom_ad]

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఒకటి కాదు రెండు కాదు ‘ఆర్ఆర్ఆర్’ ను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =