`మజ్ను`(2016)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. ఆపై `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`, `ఆక్సిజన్`, `అజ్ఞాతవాసి`, `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, `శైలజా రెడ్డి అల్లుడు`, `గీత గోవిందం` (గెస్ట్ రోల్) చిత్రాల్లో అలరించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. గత ఏడాదిని `జీరో రిలీజెస్ ఇయర్`గా సరిపెట్టిన అను.. త్వరలో తెలుగునాట రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుందట అను. ఆ వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నభా నటేశ్ ప్రధాన నాయికగా నటిస్తుండగా… సెకండ్ లీడ్ గా అను ఎంపికైందని సమాచారం. త్వరలోనే అను ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. ఈ చిత్రం తరువాత మళ్ళీ వరుస అవకాశాలతో అను మురిపిస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: