వేయిపున్నముల రారాజు రెబల్ స్టార్ కృష్ణంరాజు

Rebel Star Krishnam Raju Celebrates His 80th Birthday

కథానాయకుడిగా పరిచయమై ప్రతి నాయకుడిగా మారి మరలా కథానాయకుడిగా తనను తాను పునఃప్రతిష్టించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు ఈరోజు. 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు ఈరోజుతో 80 వ పడి లోకి ప్రవేశించి వెయ్యి పున్నముల చంద్రోదయాన్ని తిలకించిన పూర్ణాయుష్కులయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఈ 80 సంవత్సరాల సంపూర్ణ జీవితంలో 50 సంవత్సరాల సినీ జీవితాన్ని, 20 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారు కృష్ణంరాజు. నిజానికి చిత్రరంగంలో ఆయన నట జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. కథానాయకుడిగా ఆయన తొలి చిత్రం “చిలకా గోరింక” ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవటంతో ప్రతినాయక పాత్రలు చేయవలసిన పరిస్థితి నుండి ఆయన తప్పించుకోలేక పోయారు. అయితే ఆ ప్రతినాయక పాత్రలలో సైతం ఒక విన్నూత్న, విలక్షణ అభినయ శైలిని ప్రదర్శించడంతో నటుడిగా గొప్ప గుర్తింపు పొందారు కృష్ణంరాజు . అయితే కథానాయకుడికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రతినాయక పాత్రలకే పరిమితమైన స్థితిలో ఆయన అంతర్మధనం నుండి పుట్టిన గొప్ప నిర్మాణ సంస్థ “గోపి కృష్ణ మూవీస్”. హీరోగా తనను తాను నిర్మించుకోవటంతో పాటు ఉత్తమ అభిరుచి, దక్షతగల నిర్మాతగా కూడా తనను తాను విస్తృతం చేసుకుంటూ కృష్ణంరాజు నటించి, నిర్మించిన చిత్రాలే ఆయనను రెబల్ స్టార్ గా ప్రేక్షకుల ముందు నిలబెట్టాయి.

కృష్ణవేణి, అమరదీపం, భక్త కన్నప్ప వంటి సొంత చిత్రాలతో ఆయన సాధించుకున్న అద్భుత విజయాలే ఆయన సుదీర్ఘ ప్రస్థానానికి, ప్రస్తుత స్థాన విశిష్టతకు పునాదిరాళ్లు అయ్యాయి. అలా తనమీద తానే తిరుగుబాటు బావుటా ఎగర వేసుకుని కథానాయకుడిగా తన సత్తాను చాటుకున్న తరువాతే బయట నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయడానికి ముందుకు వచ్చారు.

[custom_ad]

నిజానికి వచ్చిందే చాలు… దక్కిందే పదివేలు అనుకుంటూ ప్రతినాయక పాత్రలకే ఆయన పరిమితమై ఉంటే ఈ రెబల్ స్టార్ అనే బిరుదు, ఈ ప్రశంసలు, ఈ ప్రతిష్ట ఆయనకు దక్కేవి కావు.

అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి కేంద్రమంత్రిగా అత్యున్నత పదవిని అలంకరించిన మొట్టమొదటి సినీ పర్సనాలిటీగా ఆయన పేరు సినీ రాజకీయ రంగాల చరిత్రలో నిలిచిపోయేది కాదు.

[custom_ad]

కృష్ణంరాజు నట జీవితంలో కనిపించే గొప్ప ఫైటింగ్ స్పిరిట్ ను యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఎందుకంటే స్వతహాగా ఆయనది బాగా ఉన్న కుటుంబం… ప్రతినాయక, సహాయ పాత్రలలో కూడా బాగా సంపాదించారు… ఇంతకుమించి ఇంకేం కావాలి అని రిలాక్స్ అవ్వకుండా జరిపిన పోరాట ఫలితమే ఈ రోజున ఆయన అనుభవిస్తున్న సమున్నత స్థానానికి కారణం.

నిర్మాతలుగా మారి సొంత సినిమాలు తీసిన హీరోలు చాలామంది ఉన్నారు. కానీ గోపీకృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణం రాజు నిర్మించిన చిత్రాలు మాత్రం గొప్ప కథాంశాలకు, ఉన్నత సాంకేతిక విలువలకు, అద్భుత నిర్మాణ ప్రమాణాలకు పట్టుగొమ్మలుగా, ఆయన ఉత్తమ అభిరుచికి నిదర్శనంగా నిలుస్తాయి.

[custom_ad]

ఈ విధంగా నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, ఇండస్ట్రీ పెద్దగా వెయ్యి పున్నముల నిండు జీవితాన్ని ఆస్వాదించిన రెబల్ స్టార్ కృష్ణంరాజుకు హృదయపూర్వక జన్మదిన శుభాభినందనలు పలుకుతుంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =