ఫైనల్లీ పవన్ ‘పింక్’ రీమేక్ షూటింగ్ ప్రారంభం..!

వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు గతకొద్ది కాలంగా వార్తలు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఫైనల్లీ ఈ వార్తలకు బ్రేక్ పడింది. మొత్తానికి ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ వేదికగా వేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. పవన్ పై మొదటి సన్నివేశంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉండగా ఒకపక్క రాజకీయాల్లో కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ ఈ సినిమా కోసం కొద్దిరోజులు మాత్రమే కేటాయించడంతో దర్శక నిర్మాతలు కూడా అందుకు అనుగుణంగా పవన్ తో షూట్ చేయాలని చూస్తున్నారట.

కాగా అమితాబ్‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను త‌మిళంలో ‘నెర్కొండ పార్వాయి’ అనే టైటిల్‌తో.. అజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది. మరి తెలుగులో ఎంత వరకూ హిట్ కొడుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fifteen =