మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటల వలలో ఎవరైనా పడిపోవాల్సిందే. అలా తన మాటలతో మాయ చేసి ‘అల వైకుంఠపురములో సినిమాతో ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో వున్నాడు త్రివిక్రమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో చేయబోతున్నట్టు ఇప్పటికే పలు వార్తలు విన్నాం. ఇక త్రివిక్రమ్ కూడా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను కూడా త్రివిక్రమ్ వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
[custom_ad]
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా కాస్త లేట్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే జులై 30 న ప్రకటించిన రిలీజ్ డేట్ అక్టోబర్ కు వాయిదా పడ్డట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే సినిమా షూటింగ్ తర్వాత ఎన్టీఆర్ చేసే పనులు ఏం వుండవు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోవాల్సింది రాజమౌళిని. సో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో తన సినిమాను పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామనే ప్లాన్ చేస్తున్నాడట. మరి చూద్దాం త్రివిక్రమ్ ప్లాన్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: